మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సన్నిహితుడు ఎండి సలీం గుండెపోటుతో మృతి.
..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అత్యంత సన్నిహితుదు ఎండి సలీం గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. మైనార్టీ నాయకుడుగా దోమకొండ మండలంలో ముస్లిం సోదరులను ఏకతాటిపై తీసుకువచ్చి గంప గోవర్ధన్ కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టిడిపిలో క్రియాశీలకంగా పనిచేయడమే కాకుండా పార్టీ విస్తరణకు ఆయన కృషి చేశాడు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నుండి క్రియాశీలక సభ్యుడిగా దోమకొండ మండలం కో ఆప్షన్ సభ్యుడుగా పనిచేశారు. 2013లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కామారెడ్డి లో జరిగిన కరీం ఆత్మహత్యకు పాల్పడడంతో అప్పడి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో పాటు సలీం టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసి ఉద్యమం ఉధృతం చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది. 2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు స్థానికంగా ఉంటూ మైనార్టీ నాయకుడుగా కామారెడ్డిలో తనకంటూ ఒక నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. 2018లో దోమకొండ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైనారు. అప్పటినుండి ఇప్పటివరకు గంప గోవర్ధన్ అత్యంత సన్నిహితులు లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మృతదేహం కు వందలాది మంది చేరుకొని నివాళులర్పించారు. ఈరోజు దోమకొండ లో సాయంత్రం నాలుగు గంటలకు ముస్లిం కబ్రాస్థానంలో అంత్యక్రియలు జరుపుతారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


