కామారెడ్డి అభివృద్ధికి నా తుదిశ్వాస వరకు పాటుపడతా…
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సలహాదారు షబ్బీర్ అలీ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 19 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడం కోసం గతంలోనే 120 కిలోమీటర్ల దూరం నుండి గోదావరి జలాలను తీసుకువచ్చాను.
కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి మళ్లీ కామారెడ్డికి నీటి కష్టాలు తెచ్చింది”
అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ విమర్శించారు.
ఆదివారం కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో రూ. 1.35 కోట్లతో సీసీ రోడ్లు, పార్కు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ
కామారెడ్డికి 25 ఏళ్ల వరకు నీటి కష్టాలు రాకుండా నేను ఎంతో కష్టపడి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమృత్ పథకం కింద రూ. 200 కోట్లు మంజూరు చేయించామని, దీనివల్ల రాబోయే 25 ఏళ్ల వరకు కామారెడ్డి పట్టణానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
తాను ఎప్పుడూ పేరు కోసం పనిచేయలేదని, ప్రజల కష్టాలు తీర్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రోటోకాల్ రాజకీయాలపై విమర్శలు
స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డిపై షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గడిచిన రెండేళ్లుగా ఎమ్మెల్యే సహకారం కోసం వేచి చూశాను. కానీ ఆయనకు అభివృద్ధి కంటే ప్రోటోకాల్‌పైనే ఎక్కువ ధ్యాస ఉంది.
అభివృద్ధి జరుగుతున్న చోట 14 గ్రామాలపై విజిలెన్స్ విచారణకు ఫిర్యాదు చేయడం ఆయన వైఖరికి నిదర్శనం” అని మండిపడ్డారు.
అధికారులు శంకుస్థాపనల కోసం సమయం అడిగితే మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నానని చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
కొడంగల్‌తో సమానంగా నిధులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, ఆయన నియోజకవర్గం కొడంగల్‌కు ఇచ్చే నిధుల్లో సగం అయినా కామారెడ్డికి ఇవ్వాలని కోరానని, దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కొడంగల్‌తో సమానంగా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని షబ్బీర్ అలీ వెల్లడించారు.
ప్రస్తుత అభివృద్ధి పనుల వివరాలు:
ఇందిరా గాంధీ స్టేడియం: రూ. 9 కోట్లతో ఆధునీకరణ.
వార్డుల అభివృద్ధి: పట్టణంలోని ప్రతి వార్డుకు రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. 26 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల నిర్మాణం.
15వ వార్డు: రూ. 1.35 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు. ఈరోజు ప్రారంభం ఇచ్చామని అన్నారు
అభివృద్ధి చేసేవారికే పట్టం కట్టండి
“ఇక్కడ ప్రజలు మాజీ సీఎం కేసీఆర్‌ను ఓడించారు, ప్రస్తుత సీఎంను మూడో స్థానంలో నిలిపారు. కానీ అభివృద్ధి మాత్రం ఆగదు.
శిలాఫలకాలు వేయనివ్వకపోయినా, అడ్డంకులు సృష్టించినా కామారెడ్డిని అభివృద్ధి చేసి తీరుతా” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ పదవిలో ఉన్నప్పటికీ, తన సొంత గడ్డ అయిన కామారెడ్డి అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడతానని షబ్బీర్ అలీ పునరుద్ఘాటించారు


