విద్యా వ్యవస్థ బలోపేతమే రేవంత్ సర్కార్ లక్ష్యం..!
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీగ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 19 (అఖండ భూమి న్యూస్);
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే విద్యా రంగానికి పునాదులు పడ్డాయని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో విద్యా వ్యవస్థను పటిష్ట పరుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ అన్నారు.
కామారెడ్డి పట్టణంలోని డైరీ టెక్నాలజీ కాలేజీలో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.
గత పదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో రెండే రెండు డైరీ కాలేజీలు మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు. అందులో ఒకటి కామారెడ్డిలో కాగా, రెండోది తిరుపతిలో ఏర్పాటైందని తెలిపారు.
పశుసంవర్ధక శాఖ మరియు పాల ఉత్పత్తి రంగంలో నిపుణులను తయారు చేయడంలో ఈ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
గత పదేళ్లలో అభివృద్ధి శూన్యం
గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో విద్యా రంగాన్ని మరియు ఉన్నత విద్యా సంస్థలను పూర్తిగా విస్మరించారని షబ్బీర్ అలీ విమర్శించారు.
కామారెడ్డి డైరీ కాలేజీ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది నుంచే పీజీ కోర్సు ప్రారంభం డైరీ టెక్నాలజీ కాలేజీలో పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) కోర్సును తీసుకురావడానికి ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు.
రాబోయే విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామని స్పష్టం చేశారు.
మౌలిక సదుపాయాల కల్పన
కళాశాల ఆవరణలో విద్యార్థులకు, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా రూ. 35 లక్షలతో సిసి రోడ్ల పనులకు శ్రీకారం చుట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులతో కళాశాలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకే కృషి చేస్తుంది. కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన విద్యా సంస్థగా తీర్చిదిద్దుతాం అని మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…


