హెల్మెట్ నమూనాను ఆవిష్కరించిన మంత్రి సీతక్క…

హెల్మెట్ నమూనాను ఆవిష్కరించిన మంత్రి సీతక్క…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “అర్రువ్, అలివే” కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క (దానసరి అనసూయ) నూతన హెల్మెట్ నమూనాను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లతో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ కొత్త హెల్మెట్ నమూనా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో పాటు, సౌకర్యవంతంగా, తేలికగా రూపొందించబడిందని తెలిపారు. యువతతో పాటు అన్ని వయస్సుల వారు హెల్మెట్‌ను నిత్యం వినియోగించేలా అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే “Arrive, Alive” కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతా స్పృహను పెంచుతున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రవాణా శాఖ ప్రతినిధులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!