నగర, పట్టణ, గ్రామలలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం…
టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, షబ్బీర్ షట్కర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);
నగర, పట్టణ, గ్రామాలలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తుందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ షట్కర్ లు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌక్ వద్ద స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహన్ని ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేయడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ఉద్దేశంతోనే ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆమె చేసిన సేవలను ఈ తరానికి అందించడానికి వాడవాడల ఇందిరమ్మ విగ్రహాలు ఏర్పాటుచేసి రాబోయే భావితరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా అందించాలని అన్నారు. భారతదేశంలో కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ పరిపాలనను అందించి ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం, కూడు ,గూడు అందించడమే దేయంగా పనిచేశారని గుర్తు చేశారు. సంస్కరణాలు, బ్యాంకుల పునరుద్ధరణ దేశ ఆర్థిక వ్యవస్థ ను గాడి తప్పకుండా చూడడం ఆమె ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది అని గుర్తు చేశారు. నాడు ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆమె చక్కటి పాలన రాబోయే తరాలకు భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని అన్నారు. ఇందిరాగాంధీ త్యాగపడతామే నేడు ప్రపంచంలో గుర్తింపు దక్కిందని అన్నారు. ఆమె దేశం కోసం, దేశ ప్రజల కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ ప్రజా ప్రతినిధులతో పాటు, మాయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


