ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో *గాంధారి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి 58 లక్షల రూపాయల నిధులు మంజూరు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరంతర కృషి ఫలితంగా, గాంధారి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో
నూతన *కాంపౌండ్ వాల్ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 58 లక్షల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ ఓ విడుదల చేసింది.
ఈ నిధుల మంజూరుతో గాంధారి మార్కెట్ యార్డ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడి, రైతులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడనుంది.
రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే మదన్ మోహన్ చేపట్టిన ప్రయత్నాలకు ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది.
గాంధారి ప్రాంత రైతులు, వ్యాపారులు ఈ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ కి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


