*వినాయక నగర్ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏ ఎస్ పి చైతన్య రెడ్డి*ల…
*అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కాలనీ అని ప్రశంస*ల..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 22 (అఖండ భూమి న్యూస్);
వినాయక నగర్ కాలనీలో సీసీ కెమెరాలు చైతన్య రెడ్డి ప్రారంభించడం జరిగింది ఏ ఎస్ పి గారు మాట్లాడుతూ కాలనీ వాసులందరూ ఇంటికి తల 1500 రూపాయలు కలెక్ట్ చేసుకొని సొంతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం ప్రతి కాలనీ తమ రక్షణ కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించవలసిందిగా కోరారు. సీఐ నరహరి గారి సహకారంతో సీసీ కెమెరాలును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిఐ మాట్లాడుతూ చెప్పగానే స్పందించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నందుకు కాలనీవాసులు అందరికీ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చింతల లింగం మాట్లాడుతూ ప్రస్తుతం 12 కెమెరాలను కాలనీలో ఏర్పరచడం జరిగింది. రెండో విడతలో ఇంకొక 20 కెమెరాలను ఏర్పాటు చేసుకుంటామని కాలనీ వాసుల అందరి సహకారంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. వినాయక నగర్ కాలనీలో ఏ కార్యక్రమమైనా అందరూ కలిసి నిర్వహించడం వల్ల అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామని కాలనీ అధ్యక్షులు చింతల లింగం చెప్పారు ఈ కార్యక్రమంలో కాలనీ కోశాధికారి సునీల్ కుమార్ కాలనీ ప్రధాన కార్యదర్శి షాదుల్లా, అడ్వకేట్ తిరుపతి,రామకృష్ణ రాజు,రంజిత్, కే శ్రీనివాస్, నరేష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కమలాకర్ రెడ్డి, సంజీవ్, విజయ పాల్ రెడ్డి నరసయ్య, దత్తు ,ప్రవీణ్ ,రమేష్, శ్రీనివాస్, పొన్నాల, కిషన్, స్వామి16 వార్డ్ మాజీ కౌన్సిలర్ వంశీ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ రామ్మోహన్ , మహిళలు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


