భూభారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్…

భూభారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 22 (అఖండ భూమి న్యూస్);

గాంధారి మండలం చెన్నాపూర్ గ్రామంలో భూభారతి చట్టం కింద చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్‌గా చెన్నాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసి, గ్రామ పరిధిలోని మొత్తం 506 ఎకరాల భూములను రీసర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూభారతి చట్టం ద్వారా రైతుల భూములకు సంబంధించిన గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ, నిజమైన భూ యజమానుల పేర్లను అధికారికంగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ధరణి పోర్టల్ అమలుతో అనేక మంది రైతులు భూములు కోల్పోయారని, తప్పుడు సర్వే నంబర్ల కారణంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని పరిస్థితులు ఎదురయ్యాయని విమర్శించారు. భూముల సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

ధరణి వ్యవస్థలోని లోపాలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల భూ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి వివరించినట్లు తెలిపారు. స్పందించిన ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ప్రతీ రైతు భూమిని రీసర్వే చేయాలని నిర్ణయించడంతో, పైలట్ ప్రాజెక్ట్‌గా చెన్నాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.

ఈ కీలక నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!