దోమకొండలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం స్థల సర్వే… 
దోమకొండ 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం నిర్మాణం అనుమతులు అందించాలి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 22,(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా డీసీహెచ్‌ఎస్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దోమకొండ మండల కేంద్రంలో నిర్మించనున్న50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం గురువారం స్థల సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మండల సర్వేయర్, మండలv రెవెన్యూ అధికారులు సహా ఇతర మండల అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రి డిఈ అరవింద్ హాజరై నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించారు. భవిష్యత్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సర్వే చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తిర్మల్ గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


