కామారెడ్డి జిల్లాలో శంకర్ దాదా ఎంబిబిఎస్ లు …
– జిల్లాలో పుట్టగొడుగుళ్లా దర్శనం ఇస్తున్న ఆర్ఎంపీ ల చికిత్స కేంద్రాలు..
– రోగులకు సూదులు, సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తున్న కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు ..
– ప్రజల ధన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కొందరు శంకర్ దాదాలు ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 23 (అకాండ భూమి న్యూస్);
నాడీ పట్టి రోగికి ఉన్న రోగాన్ని నయం చేయాల్సిన వైద్యం ఈ మద్య వికటిస్తుంది. వైద్యల నిర్లక్ష్యమా..! సరైన వైద్య వృత్తి అభ్యసించకనా తెలియదు గానీ దవాఖానాలోకి వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి దాపురించింది. ఓ వైపు ప్రైవేటు దవాఖానాలు ముక్కు పిండి మరీ రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరికొందరు వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు వస్తుంది. ఇటువంటి సంఘటనలు జిల్లాలో పలు సందర్భాల్లో బయటపడుతున్నాయి. ఇటీవల ఓ నవజాత శిశువు సైతం మృతి చెందిన సంఘటన చోటు చేసుకోగా మరో ఘటనలో కేస్ షీట్ మారడంతో ఏకంగా లేని రోగానికి మందులు వాడటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో దవాఖానాలో ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రజల్లో మొదలైంది. ఇదిలా ఉంటే మరో పక్క కొందరు ఆర్ ఎంపీ, పీఎంపీ వైద్యులు సైతం పెద్ద డాక్టర్లుగా అవతారమెత్తి సెలన్ బాటిళ్లు ఎక్కిస్తూ సొంత వైద్యం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. అలాగే మరికొందరు ప్రైవేటు దవాఖానాలకు ఏజంట్లుగా వ్యవహరిస్తూ కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది లేకుండా ఆయా దవాఖానాలు కొనసాగించడం ఇలాంటి సంఘటనలకు కారణం అవుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిత్యం వైద్యంపై అప్రమత్తంగా వ్యవహరిస్తూ దవాఖానాలను, రోగులకు ఇచ్చే మందులను పరిశీలించాల్సిన సంబందిత శాఖ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతోనూ ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా అధికారులు వెంటనే స్పందించి జిల్లాలోనీ ఆయా గ్రామాలలో ఉన్న కొందరు శంకర్ దాదా ( ఆర్.ఎం.పి డాక్టర్ ) లపై సత్వర చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొందరు ఆర్ఎంపి ల వల్ల దన, ప్రాణ నష్టం జరగకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని ఆసుపత్రులలో సంబంధిత చదువులు , విద్యార్వత లేని సంబంధిత టెక్నీషియన్లు, నర్సులు, నకిలీ డాక్టర్లు సైతం చలామణి అవుతున్నారు. జిల్లా సంబంధిత అధికారులు దీనిపై నిఘా పెట్టకుండా తూ తూ మంత్రంగా ముందే సమాచారం అందించి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకే పేరు మీద ఉన్న ఇద్దరు పేషెంట్లు కేర్ షీట్లు మారిపోవడంతో ఒకరి మందులు ఇంకొకరు వాడడంతో ఇటీవల ఒకరు మరణించిన విషయం తెలిసిందే. మానవ జీవితం ఎంతో ముఖ్యమైన జీవితం. టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు సాగుతున్న తరుణంలో రోగులను నయం చేసే వైద్య సేవలను సైతం ఆ క్యాడర్లకు సరిపడు విద్యార్వత ఉండాలని ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కోర్సులలో ఉత్తీర్ణులైన వారిని నియమించాలనే వారిని పక్కన పెట్టి ఆర్వత లేని వారిని ఆస్పత్రిలలో ఉద్యోగులుగా చేర్చుకొని ప్రాణాలకు ముప్పుగా మారారు. ఆయా ఆస్పత్రిలోని మెడికల్ లో సైతం అర్హత కలిగిన వారిని కాకుండా ఇతరుల సర్టిఫికెట్లు లీజుకు తీసుకొని యదేచ్చగా మెడికల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి ఆసుపత్రులు సెంటర్లపై, ఎలాంటి పర్యవేక్షణ, తనిఖీలు లేకుండా అధికారులు పట్టించుకోవడంలేదని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరిపై నిఘా లేకపోవడంతో మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా వీరిపై నిఘా పెట్టి నకిలీలతో పాటు కల్తీ జాషదాల విక్రయాలపై ప్రభుత్వం, అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


