సౌత్ క్యాంపస్ లో స్వదేశీ 2K రన్ …
స్వదేశీ వస్తువుల వినియోగం వల్ల దేశం సురక్షితంగా ఉంటుంది.
— డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 24 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో యువజన వారోత్సవాల్లో భాగంగా స్వదేశీ 2k రన్ ను ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ అంజయ్య , డాక్టర్ హరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ. దేశం సురక్షితంగా ఉండాలంటే యువత శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా దృఢంగా ఉండాలన్నారు. మన జీవితంలో వాకింగ్ మరియు యోగ భాగం కావాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజయ్య స్వదేశీ భావన అనేది మన జీవితంలో భాగం కావాలన్నారు. 2 k రన్ సమన్వయకర్త డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా మాట్లాడుతూ మనం వాడే వస్తువులు , వ్యాపారాలలో స్థానిక స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్వాలంబన గా దశగా తీర్చిదిద్ద పడుతుందని , యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. ప్రతి ఇల్లు స్వదేశీ, ప్రతి యువకుడు స్వదేశీ భావనను కలిగి ఉండి విదేశీ ఉత్పత్తులకు బదులు స్వదేశీ ఉత్పత్తులను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ డాక్టర్ జి సునీత, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ సబిత, డాక్టర్ ప్రతిజ్ఞ, డాక్టర్ నాగరాజు, ఏ పి ఆర్ ఓ డాక్టర్ సరిత, డాక్టర్ రమాదేవి, డాక్టర్ నిరంజన్, శ్రీకాంత్, డాక్టర్ పోతన్న, డాక్టర్ సునీల్, డాక్టర్ కనకయ్య విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


