విద్యార్థులు ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి…
లిటిల్ స్కాలర్ స్కూల్లో రేడియో హౌస్ ను సందర్శించిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని లిటిల్ స్కాలర్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన రేడియో హౌస్‌ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఈరోజు సందర్శించారు.
ఈ సందర్భంగా రేడియో హౌస్‌లోని విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని, విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ గారు మాట్లాడుతూ
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఇలాంటి రేడియో హౌస్ కార్యక్రమాలు ఎంతో కీలకమని మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పేర్కొన్నారు.
పుస్తకాల చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరమని, చిన్న వయసులోనే మీడియా పరిజ్ఞానం అలవర్చుకోవడం భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
లిటిల్ స్కాలర్ స్కూల్‌లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం యాజమాన్యం, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు.
ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడి చదవాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
చివరిగా విద్యార్థులను ఆయన ఆత్మీయంగా అభినందించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


