26న దోమకొండలో మన సంస్కృతి, మేళా…

26న దోమకొండలో మన సంస్కృతి, మేళా…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);

మన సంస్కృతి మేళాలో భాగంగా సోమవారం దోమకొండ మండలం , పరిసర మండలాల రైతులకు అత్యంత అవసరమైన కార్యక్రమం. ఉచిత భూసార పరీక్షలు

, దోమకొండ కోట నందు

ప్రతి సంవత్సరం నిర్వహించే ద 26.01.2026 – గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించే మన సంస్కృతి మేళా రైతులకు అనుకూలమైన , రైతులకు ఏదో రకంగా ఉపయోగపడే వ్యవసాయ పద్ధతులు ఆధునిక పద్ధతుల గురించి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి ప్రదర్శించడం, హోగాన కల్పించడం జరుగుతుంది అని దోమకొండ & ట్రస్ట్/లైఫ్ సంస్థ ప్రతినిధి జాలాది బాబ్జి తెలిపారు. అదే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దోమకొండ ఫోర్ట్ ట్రస్ట్ , లైఫ్ ఎన్ జీవో సంయుక్తంగా రైతులకు ఎంతో అవసరమైన భూసార పరీక్షలు సెంట్ఇంటల్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించడం జరుగుతుందనీ

ఈ భూసార పరిక్షల వల్ల రైతులు పండించే భూమి యొక్క నాణ్యత, భూసార స్థితి, ఏ ఖనిజ లవణాలు తక్కువగా ఉన్నాయో, ఆ భూమికి అనుకూలమైన పంటలు ఏవో వంటి పూర్తి వివరాలను ఏ విధమైన ఖర్చు లేకుండా వివరంగా తెలియ చేయ బడతాయి..

ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ఈ జనవరి 26వ తేదీన నిర్వహించబడే రైతు మేళాను సందర్శించి మీకు అవసరమైన ఉచిత భూసార పరీక్షలను చేయించుకోవచ్చు అన్నారు.

భూసార పరీక్షకు మీరు చేయవలసిన పనులు :

1. మట్టి నమూనా సేకరణ: * పొలంలో 2-3 చోట్ల నుండి 6-8 అంగుళాల లోతు నుండి మట్టి నమూనాలను సేకరించండి. నమూనాలను ఒక ప్లాస్టిక్ బకెట్లో వేసి కలపాలి.

2. నమూనా తయారీ: మట్టి నమూనాను ఎండలో ఆరబెట్టండి. పెద్ద రాళ్లు, గడ్డి తీసివేయండి. * మట్టిని చిన్న ముక్కలుగా చేసి, ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేయండి.

3. 26.01.2026 ఉదయం 9 గంటలకు మీ మట్టి నమూనాను తీసుకొని వచ్చి, దోమకొండ కోట నందు భూ సార పరీక్షలు చేయించుకొని భూసార ఫలితాలు తెలుసుకోవాలని సూచించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!