కామారెడ్డిలో బీటీ రోడ్ల పనులను ప్రారంభించిన
షబ్బీర్ అలీ..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలలో బీటీ రోడ్ల పనులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం ప్రారంభించారు. కామారెడ్డి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. కామారెడ్డి పట్టణం మున్సిపాలిటీ నీ కార్పొరేషన్ కు దీటుగా అభివృద్ధిలో పరుగులు తీయించడమే తన లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కామారెడ్డి ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించి మున్సిపాలిటిపై కాంగ్రెస్ విధంగా సహకరించాలని కోరారు. కామారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, దశలవారీగా కామారెడ్డి రాష్ట్రంలో మోడల్ కామారెడ్డిగా ఏర్పాటు చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ప్రజలు సహకరించి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


