ఓటర్ దినోత్సవ సందర్భంగా ఈపిఐసి కార్డులు పంపిణీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
అదనపు కలెక్టర్ విక్టర్..
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ పి ఐ సి కార్డుల పంపిణీ & వ్యాసరచన పోటీ సర్టిఫికెట్ల అదనపు కలెక్టర్ విక్టర్ ఆదివారం ప్రధానం చేశారు.
జాతీయ ఓటరు దినోత్సవం ను పురస్కరించుకొని కలెక్టరేట్ లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
18 సంవత్సరాలు నిండిన యువతను అధికారికంగా ఓటర్లుగా నమోదు చేసుకునే ఉద్దేశంతో వారి ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డులు (ఈపీఐసీ) 10 మందికి అదనపు కలెక్టర్ అందజేశారు.
18 ఏళ్లకు చేరిన ప్రతీ అభ్యర్ధిని ఓటర్‌గా నమోదు చేసుకోవాలని సూచించారు
జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు/యువతకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.
కార్యక్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత, యువత పాత్ర, అర్హత పొందిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాల్సిన అవసరం పై అదనపు కలెక్టర్ విక్టర్ స్పష్టమైన వ్యాఖ్యానాలు చేశారు. అన తరం ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమం లో ఆర్డీఓ వీణ, తహసిల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


