దోమకొండ మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర వేడుకలు…
కామారెడ్డి, జిల్లా ప్రతినిధి; జనవరి 26,(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సుధాకర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం పై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు బిజెపి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తర పార్టీల మండల నాయకులు వారి జండా గద్దల వద్ద పథకాలను ఎగురవేసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు మిఠాయిలు పంచుకున్నారుఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ మధుసూదన్ రావు, ఎక్సైజ్ ఎస్ ఐ దీపిక , పోలీసు సిబ్బంది, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది , గ్రామ ప్రజలు పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.


