కుల సంఘాల ఆధ్వర్యంలో దోమకొండలో ఊర పండగ ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఊర పండగ ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని కుల సంఘాలు ఐక్యతతో శుక్రవారం ప్రారంభమైంది. గ్రామంలో శుక్రవారం ఊరడమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, కట్ట మైసమ్మ, వందలాది సంవత్సరాల క్రితం పురాతన రాతితో నిర్మించిన బురుజు వద్ద గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలను పూజించారు. చల్లటి అంబలి చేయడం, ముడుపులు కట్టి, గ్రామ దిగ్బంధం చేశారు. అమ్మవార్లకు తరతరాలుగా చేస్తున్న విగ్రహాలు, రత్నాలు, ఏనుగులు, ఆయుధాలు వంటి వినూత్న తరహాలో అమ్మవారిలకు అలంకరణ చేయడం జరుగుతుంది. సాయంత్రం బోనాలు తీయడం, ఆదివారం గ్రామ పొలిమేరలకు వెళ్లి విందులు చేసుకోవడం జరుగుతుంది. శుక్రవారం స్థానిక చాముండేశ్వరి ఆలయం నుండి పోతరాజుల విన్యాసాలతో, డప్పు వాయిద్యాలతో, రంగసానిల నినాదాలతో ఊరంతా మారు మ్రోగింది. ఐదు రోజులపాటు జరిగే ఊర పండగ ఉత్సవాలు ఎప్పుడు లేని విధంగా దోమకొండ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జరుపుకుంటున్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


