భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బీబీ పటేల్ , బాణాల లక్ష్మారెడ్డి…

*భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బీబీ పటేల్ , బాణాల లక్ష్మారెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (అఖండ భూమి న్యూస్);

భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా వారి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ బీబీ పటేల్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం అని. 12 వార్డులకు గాను 12 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు.

నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ఓట్లు అడగాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు వారు విజ్ఞప్తి చేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంధర్ రావ్ , అసెంబ్లీ కన్వీనర్ లింగారావు , సీనియర్ బిజెపి నాయకులు దేవేందర్ , మర్రి బాల కిషన్ , ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు నర్సింలు , పట్టణ అధ్యక్షులు రాజేష్ , ఎల్లారెడ్డి మాజీ మండల అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి , గిరిజన మోర్ష మాజీ జిల్లా అధ్యక్షులు రవి ,ఎల్లారెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు సతీష్ , హోటల్ శీను , కిష్టయ్య , నవీన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!