సీ పీని పోబే తురుకోనికి ఏం తెలుసు అని అనడం కౌశిక్ రెడ్డి సంబోధించడం సంబోధించడం సరికాదు. 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (అఖండ భూమి న్యూస్);
బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక పోలీస్ అధికారి అయిన సిపిని పోవే తురుకోడ కూడా అని అవమానించడం సరికాదని బీబీపేట మండల పరిషత్ కో ఆప్షన్ మాజీ సభ్యుడు ఆసిఫ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలను , శాంతిభద్రతలను, పర్యవేక్షణ చేస్తూ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఉద్దేశంతో సిపి విధులను నిర్వహణ చేస్తుంటే తురుకోడ , నీకేం తెలుసు అని అవమానించడం సరికాదన్నారు. ముస్లిం అధికారి అని అవమానించడం బాధాకరమైనటువంటి విషయం అని అన్నారు. ముస్లింలు ఓట్లు వేయకుండానే విజయం సాధించావా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ప్రసారమాధ్యమాల్లో ఉండాలని ఇతరులపై దుర్బష రాయడం సరికాదు అన్నారు. వెంటనే సీపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే క్షమించేది లేదని ప్రకటనలో డిమాండ్ చేశారు.


