విద్యార్థులు చదువులతోపాటు క్రీడలలో రాణించాలి ..!
జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంతరెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ. క్రీడలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్ అన్నారు. శుక్రవారం సీఎం కప్ మండల స్థాయి క్రీడోత్సవాల ముగింపు, బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా గారు షబ్బీర్ అలీ గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ట్రోపీలను అందజేశారు. మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్ బాలికల విభాగం క్రీడాకారులకు తన విరాళంతో ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ పాత రాజు, సర్పంచ్ ఆశ బోయిన అక్షర శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంఈఓ విజయ్ కుమార్, ఎంపీఓ రవికుమార్, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శంకర్ రెడ్డి, స్వామి, వివిధ పాఠశాలల పీడీలు అనిల్ కుమార్, సాయి మౌర్య తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


