కామారెడ్డి బల్దియా పై బిజెపి జెండా ఎగురవేయడం ఖాయం…

కామారెడ్డి బల్దియా పై బిజెపి జెండా ఎగురవేయడం ఖాయం…

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 31 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మున్సిపాలిటీ పై ఈసారి బిజెపి జెండా ఎగురవేసి పీఠం దక్కించుకోవడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. కామారెడ్డిలో మెజార్టీ కౌన్సిలర్ల స్థానాలను బిజెపి కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవినీతి లేని పాలన అందించాలంటే కామారెడ్డి పట్టణ ప్రజలు బిజెపికి ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని అన్నారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలకు పట్టం కట్టారని అన్నారు. గత పాలకులు అవినీతి పాలన అందించి కామారెడ్డి అభివృద్ధిని అడ్డుకున్నారని దుయ్యబట్టారు. సెటిల్మెంట్లు, భూకబ్జాలు, లేని రోడ్లు నిర్మించినట్లు, ఉన్నవి లేనట్టు, మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి కొట్టారని అన్నారు. గత రెండు సంవత్సరాలు నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుండి ఆరు లక్షల వరకు ఉన్న ఆదాయమును 11 లక్షల వరకు పెంచామని అన్నారు. అవినీతి మున్సిపల్ పాలకవర్గాలతో కామారెడ్డి అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఇలాంటి అవినీతి పాలకవర్గాలకు కాకుండా కామారెడ్డిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మోడల్ కామారెడ్డిగా ఏర్పాటు చేయడానికి కామారెడ్డి పట్టణ ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. అవినీతి పాలన అందించి దండుకునేవారు కావాలో, అభివృద్ధిలో పరుగులు పెట్టించే బిజెపి పాలకవర్గం కావాలో ప్రజలు ఒకసారి ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!