దోమకొండ ఊర పండగ చూతము రారండి…
అంగరంగ వైభవంగా ఐదు రోజుల పండగ..
శనివారం కొలుపుల తల్లి గ్రామ పర్యటన..
ఘనంగా సార్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట..
దోమకొండ బూర్జు వద్ద జన జాతర..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 31 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఈ నెల 30న ప్రారంభమైన దోమకొండ ఊర పండగ ఐదు రోజుల పండగ జన జాతరతో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దోమకొండ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఐదు రోజుల ఊరపండగ కు చుట్టుముట్టు ప్రాంతాల వారు తండోపతండాలుగా హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. గ్రామంలోని చరిత్ర కలిగిన దోమకొండ బుర్జుకోట తో పాటు ఊరడమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, అగ్రహారం పోచమ్మ, , పెద్దమ్మ, దుర్గమ్మ , కట్ట మైసమ్మ ల ఆలయాల వద్ద భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆలయాల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో సకల సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులు నిర్వహించే ఊర పండగకు ప్రత్యేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. కొలుపుల తల్లి గ్రామ పర్యటన సందర్భంగా డప్పు వాయిద్యాలతో పాటు పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నాటి నృత్యములతో అంగరంగ వైభవంగా కనులవిందుగా కార్యక్రమాలు చేపట్టారు. దోమకొండ బూర్జ వద్ద సార్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. మొత్తానికి దోమకొండ బూర్జు కర్నూలు బురుజుకు తక్కువ కాకుండా చెక్కుచెదరని రాతితో కట్టిన చరిత్ర కలిగిన కట్టడాలను చూసి భక్తులు సందర్శిస్తున్నారు. మొత్తానికి దోమకొండలో జాతర తలపిస్తుంది. ఫిబ్రవరి 1న తల్లికి రంగం, గావు, గ్రామం వదిలి పొలిమేరలలో వనభోజనాలు చేయడం, 2న ఊరడమ్మకు చేయడం, 3న కట్ట మైసమ్మ కు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కుల సంఘాలతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


