సీఎం కప్ జిల్లాస్థాయి అర్చరి పోటీలు ప్రారంభించిన సర్పంచ్ ఐరేని నరసయ్య, జిల్లా అర్చరి అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 9 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోటలోని మైదానంలో సోమవారం సీఎం కప్ జిల్లా స్థాయి అర్చరి పోటీలను దోమకొండ సర్పంచ్ ఐరెని నరసయ్య, జిల్లా అర్చరి అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్ ప్రారంభించారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ కుమార్ సహకారంతో ఈ పోటీలను దోమకొండ లో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇండియన్ రౌండ్ బాలికల విభాగం 30 మీటర్ల జి.సహస్ర, బాలుర విభాగంలో ఎస్.కె.రెహన్ ఎంపికయ్యారు. ఇండియన్ రౌండ్ 40 మీటర్లలో బాలికలు ఎన్.భావన, బాలుర విభాగంలో పిఆర్.రామచరణ్ ఎంపికయ్యారు. రికర్వ్ రౌండ్‌లో బాలికల విభాగంలో బి.వర్షిణి, పి.నక్షత్ర, బాలుర విభాగంలో నవీన్, ఎస్. స్నేహిత్ ఎంపికయ్యారు. కాంపౌండ్ రౌండ్ 50 మీటర్ల లో శ్రీ వైష్ణవి ఎంపికయ్యారని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైన ఈ క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఈ క్రీడాకారులు ఖమ్మంలో నిర్వహించే సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పిడి నరసింహారెడ్డి, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జి, విలువిద్య శిక్షకులు ప్రతాప్ దాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు, నాయకులు మర్రి శేఖర్, సిద్ధ రాములు, రాజేందర్, రమేష్ గౌడ్, జాతీయ క్రీడాకారిణి సింధుజ తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


