బిఆర్ఎస్ అవినీతి అడ్డా.. బిజెపి విభజన రాజకీయాల క్రీడ..!

బిఆర్ఎస్ అవినీతి అడ్డా.. బిజెపి విభజన రాజకీయాల క్రీడ..!

చేయి’ గుర్తుతోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యం…

 

కామారెడ్డి గడ్డపై షబ్బీర్ అలీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై విమర్శల గర్జన..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 09 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణంలోని 09, 10, 11, 13, 32 వార్డులలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఉధృత స్థాయిలో ఎన్నికల ప్రచారం సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన బిఆర్ఎస్ కుటుంబ పాలనను, బిజెపి ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ప్రసంగం చేశారు.

అబద్ధాల బిఆర్ఎస్. విభజన బిజెపి రెండింటినీ బంగాళాఖాతంలో కలపాలి మహమ్మద్ అలీ షబ్బీర్ పిలుపునిచ్చారు.

కాళేశ్వరం వారి ఏటీఎం.. ధరణి వారి ధనదాహం బిఆర్ఎస్ పై షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు.

పదేళ్ల కాలంలో నీళ్లు ఫామ్ హౌస్ కు, నిధులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయి.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షలను కాలరాసి, కేవలం ఒక్క కుటుంబం మాత్రమే లబ్ధి పొందింది.

ధరణి పోర్టల్ సామాన్య రైతులకు శాపంగా మారింది,” అని షబ్బీర్ అలీ విమర్శించారు.

బిజెపి – బిఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు అన్నారు.

బిజెపి ఎమ్మెల్యే వైఖరిని తప్పుబడుతూ, ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ పడుతున్నట్లు ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి.

బిఆర్ఎస్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్నారు.

ధరల పెరుగుదలతో సామాన్యుడి నడ్డి విరుస్తూ, మతం పేరుతో రాజకీయాలు చేయడం బిజెపి నైజమని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ అధికారంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు భరోసా ఇచ్చారన్నారు.

సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని స్పష్టం చేశారు.

మార్పు కావాలి – కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ముందుకు సాగాలి కామారెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ జెండా ఎగర వేయాలి అభివృద్ధికి బాట వేయాలి.

ఈ ప్రచారంలో వార్డు అభ్యర్థులు స్థానిక నాయకులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!