మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శివరాం మందిర్ ఆలయం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు చుట్టూ ప్రాంతాల ప్రజలు వేలాదిగా లక్షలాదిగా తరలివస్తారు. దోమకొండలో 12 తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శివరాత్రి మహా సందర్భంగా దోమకొండలో వెలిసిన శివరాం మందిర్ ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రథోత్సవాలు, చక్కర తీర్థం, దోమకొండ గడికోట లోని మహదేవుని ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి రోజున భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. గడికోటలో సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. ముందస్తుగా ఈ ఉత్సవాల కోసం అదనపు బస్సు సౌకర్యాలతో పాటు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


