చైర్ పర్సన్, వైస్ చైర్మన్ రేసులో గెరిగంటి ఫ్యామిలీ..?

చైర్ పర్సన్, వైస్ చైర్మన్ రేసులో గెరిగంటి ఫ్యామిలీ..?

కామారెడ్డి మున్సిపల్ కింగ్ మేకర్ బీఆర్ఎస్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 13 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కింగ్ మేకర్ గా మారింది. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 19 , బిజెపి పార్టీ 16, బీ ఆర్ఎస్ పార్టీ 11, స్వతంత్ర అభ్యర్థులు 3 కౌన్సిలర్లుగా విజయం సాధించడంతో హాంగ్ పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మొత్తం 49 కౌన్సిలర్ల గాను 25 మంది కౌన్సిలర్ల మెజార్టీ అవసరం ఉండడంతో క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీ ఆర్ఎస్ పార్టీ మద్దతు తప్పనిసరి కావడంతో కాంగ్రెస్, బిజెపి పార్టీ మద్దతు దారుల కోసం అన్వేషణ చేపట్టారు. విజయం సాధించిన ఆయా పార్టీలు కౌన్సిలర్లను తమ ఆధీనంలో ఉంచుకోవడంతో మద్దతు కోసం చర్చలు చేపడుతున్నారు. కింగ్ మేకర్ టిఆర్ఎస్ పార్టీ మద్దతు తప్పనిసరి కావడంతో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని ఆయా పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో 11 మంది కౌన్సిలర్లు విజయం సాధించగా వారిలో 46వ వార్డులో గేరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, 47 వ వార్డులో గేరిగంటి లక్ష్మీనారాయణ భార్యాభర్తలు విజయం సాధించగా టిఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిస్థాయిలో మద్దతు లేకుండా ఇతరులు మద్దతు అందిస్తే చైర్పర్సన్, వైస్ చైర్మన్ రేసులో గెరిగంటి ఫ్యామిలీ ఉన్నట్లు ప్రకటించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పై ఎవరి మద్దతుతో ఏ పార్టీ జెండా ఎగరవేస్తుందో వేచి చూడాల్సిందే. ఊహించని తరహాలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ పేరు తెరమీదకి రావడంపై కామారెడ్డి పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!