యూపీలో బాలికలకు ఉచిత స్కూటీ… విద్యకు వేగం ఇచ్చిన గొప్ప నిర్ణయం..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 14 (అఖండ భూమి న్యూస్);
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాలికల విద్యను ప్రోత్సహించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన కింద ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఉచిత స్కూటర్లు అందించేందుకు రూ.400 కోట్లు (రూపాయలు400 కేటాయించింది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్య కొనసాగించే అమ్మాయిలకు ప్రయాణ సౌకర్యం సులభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న బాలికలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. మహిళా సాధికారత లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరింత మంది విద్యార్థినులకు ప్రేరణ కలిగిస్తుంది. బాలికల భద్రత, స్వావలంబన , విద్యాభివృద్ధికి ఇది శుభారంభం. యూపీ ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న యూపీ ప్రజలు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


