*రాజకీయ విరాళాల్లో 82% బీజేపీకే..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 14 (అఖండ భూమి న్యూస్)
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా బీజేపీకి రూ. 3,157.65 కోట్లు రాజకీయ విరాళాలుగా అందాయి. ఆ ఏడాది అన్ని రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో ఇది 82.52 శాతం. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) శుక్రవారం ఓ నివేదికలో వెల్లడించింది.
20 ఎలక్టోరల్ ట్రస్ట్ సంస్థలు ఈ విరాళాలను వివిధ పార్టీలకు అందజేయగా, 5 సంస్థలు తమ వివరాలను వెల్లడించలేదని ఏడీఆర్ పేర్కొన్నది. ఆ వివరాలు కూడా బయటపడితే, బీజేపీకి వచ్చిన విరాళాలు మరింత పెరిగే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా.. 2018-2024 మధ్య కాలంలో రాజకీయ పార్టీలు విరాళాలను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరిస్తూ ఉండేవి. ఈ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరిలో రద్దు చేసింది.
అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్న కార్పొరేట్ స ంస్థలు రాజకీయ విరాళాలు ఇవ్వడానికి ఎలక్టోరల్ ట్రస్ట్‌ల బాట పట్టాయి. ఫలితంగా అత్యధిక రాజకీయ విరాళ దాతలుగా ఎలక్టోరల్ ట్రస్టులు నిలిచా యి. వీటిల్లో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అగ్రస్థానంలో ఉంది. ఇది 15 రాజకీయ పార్టీలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,668.46 కోట్లను విరాళాలుగా ఇచ్చింది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


