అగ్రకుల రెడ్లపై హత్య నేరంకేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి

గుడిలో రజక భార్యాభర్తలపై తీవ్రంగా దాడిచేసి 2నెలల పసి పాప మృతికి కారణమైన అగ్రకుల రెడ్లపై హత్య నేరంకేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి

చిలుక రాజనర్సు
మాదిగ హక్కుల దండోరా ఎంహెచ్ డి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్

*జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు*

 

బెల్లంపల్లి ఫిబ్రవరి 22(అఖండ భూమి న్యూస్):నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలో మల్లన జాతరలో దైవ దర్శనానికి వెళ్లిన ఒక రజక భార్యాభర్తల పైన దాడి చేసి 2 నెలల పసిపాప మరణించడం జరిగింది.మల్లన్న జాతరలో దర్శనానికి వచ్చిన రజాక భార్య భర్తలమీద దాడిచేసి ఒక పసిపాప మరణానికి కారణమైన రెడ్డి అగ్రకులానికి చెందిన వారిపై హత్య కేసుతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుందన్నారు.గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోడానికి వచ్చిన వాళ్ళను రజక కులస్తులు బీసీ లు అలాగే ఎస్సి మహిళా ఎంత బ్రతిమాలిన కూడా జాలి చూపకుండా కేవలం తక్కువ కులం కారణంగా కులం పేరుతో ఇష్టం వచ్చినట్టు తిట్టుతు తీవ్రంగా దాడిచేసి పసిపాపను కళ్ళతో తొక్కి చనిపోవడానికి కారణమైన దుగ్యాల శ్రీనివాసరెడ్డి,మధురేడ్డి,సతీష్ రెడ్డి లతో పాటు మరి కొంత మంది పైన హత్య నేరంతో పాటు ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసు లు నమోదు చేయాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుందన్నారు.
పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన కూడా ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయకపోవడాన్ని మాదిగ హక్కుల దండోరా తీవ్రతి తీవ్రంగా ఖండిస్తుందన్నారు.డాడీ చేసిన వారు దర్జాగా ఊర్లో తిరుగుతున్నారని,వారి కారణంగా తమ పాపను కోల్పోయిన బాధితులేమో న్యాయం కోసం రోడ్లమీద ఆందోళన చేస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.సభ్యసమాజం సిగ్గు పడేలా వ్యవహరించిన రెడ్డి అగ్రకులానికి చెందిన వారినీ ఫస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారించి వెంటనే శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామనీ ఒక ప్రకటనలో తెలిపారు…

Akhand Bhoomi News

error: Content is protected !!