అంబారీపేటలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు …
వాడవాడల ఎల్లమ్మ బోనాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 23!(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ. మండలంలోని అంబారిపేట్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయం 6 వ వార్షికోత్సవం సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు రంగోలి మైసా గౌడ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేసి, మహిళలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పుట్ట బంగారము తెచ్చుట, ఏడు అంతరాల బోనం, ఎరుకలి బుట్ట, ఎల్లమ్మ తల్లికి బోనాలు తీయుట, 24వ తేదీ మంగళవారం రోజున రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణం వేడుకలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం రోజున తిరుగు బోనాలు విందు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగోలి సత్య గౌడ్, గౌడ సంఘం సభ్యులు రంగోలు శ్రీనివాస్ గౌడ్, మైసా గౌడ్, లింగా గౌడ్, ఈశ్వర్ గౌడ్, తదితరులు , గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
You may also like
మున్సిపల్ లో పనిచేసే వయసు పైబడిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలి…
ఢిల్లీ : జూన్ 1 నుంచి జులై 12 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు…
ఎమ్మెల్యే సొంత నిధులు తీసుకువచ్చి, మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించాలి.
ప్రజావాణిలో 138 దరఖాస్తులు
*దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు*


