ప్రజావాణి కి 83 దరఖాస్తులు
జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 23 (అఖండ భూమి న్యూస్);
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో 83 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఆయా శాఖలకు సంబంధించిన భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు కొరకు , ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పేమెంట్ రాలేదని, పంచాయితీ, డిఆర్డిఓ, డి డబ్ల్యు ఓ తదితర వాటి దరఖాస్తులను స్వీకరించి అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి, పరిష్కరించాలని పేర్కొన్నారు.
ఈ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, సీఈఓ చందర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


