కాంగ్రెస్ కార్యకర్తకు అండగా నిలిచిన కాసాల జనార్దన్ రెడ్డి…!
•కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామనీ కాసాల జనార్దన్ రెడ్డి నిరూపించారు
ప్రతినిధి కురుపాటి గణేష్
(అఖండ భూమి)ఫిబ్రవరి 24 చండూరు మండలం…
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పట్ల వెంకన్న ఉపాధి కోసం, తన వ్యాపార అవసరాల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం జనార్దన్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సోమవారం వెంకన్నకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు,ఈ సందర్భంగా కాసాల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ…”పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. పట్ల వెంకన్న వంటి నిబద్ధత గల కార్యకర్తలకు అండగా ఉండటం మన బాధ్యత. వారి ఆర్థిక ఎదుగుదలకు చిన్నపాటి తోడ్పాటు అందించడం సంతోషంగా ఉంది,” అని పేర్కొన్నారు..తమకు అండగా నిలిచినందుకు పట్ల వెంకన్న మరియు ఆయన కుటుంబ సభ్యులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గుండ్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు, ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు కాసాల పాండురంగారెడ్డి,ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు వందనపు నరేందర్,4వ వార్డు సభ్యుడు తిరుమణి శ్రీనివాసులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కూరి రంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూతరాజు జంగయ్య,కట్కూరి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూతరాజు శేఖర్, భూతరాజు సుక్కయ్య,గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



