ఎన్నికల సమయంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
ఎస్.టి.యు. జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు, టీకేఎస్ ప్రసాద్ ఆర్ దేశా నాయక్,
యర్రగొండపాలెం అఖండ భూమి.
ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా.. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలైన 11వ పి.ఆర్.సి. లోని బకాయిల చెల్లింపు, 12వ పి ఆర్ సి కమిటీని నియమించడం,మధ్యంతర భృతి(ఐ ఆర్) తక్షణ ప్రకటన,) సి.పి.ఎస్. రద్దు, పదవీ విరమణ చెందిన రోజే అన్ని రకాల పెన్షన్ చెల్లింపులు, మెమో నెంబర్.57 అమలు, పెండింగ్ లో ఉన్న డి.ఎ. ల విడుదల తదితర హామీలు ఇచ్చి ఇప్పటికి రమారమి ఇరవై నెలలు దాటినాచెల్లించవలసిన బకాయిలు రమారమి ఇప్పటికి 34 వేల కోట్లకు చేరుకొన్నా..ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రోజురోజుకు ఆర్థికంగా నష్టం కలుగుతున్నా. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల గురించి ఎన్నిసార్లు ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడం,కనీసం పట్టించుకోకపోవడం,నిర్లక్ష్య వైఖరులకు నిరసనగాఎస్.టి.యు. సంఘం, సంఘ రాష్ట్ర నాయకత్వం, సమస్యల సాధన కోసం,మూడు దశల పోరాటాలకు పిలుపునిచ్చింది.
మొదటి దశలో జనవరి 30న సమస్యల సాధన కోరుతూ.. అన్ని మండల తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాల సమర్పణ.రెండవ దశలో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయాల ఎదుట ఫిబ్రవరి 13 న ధర్నా నిర్వహించే కార్యక్రమం అందరి కార్యకర్తల, నాయకుల సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేయబడింది. ఇప్పుడు విజయవాడ ధర్నాచౌక్ లో ఫిబ్రవరి 25 న నిర్వహించబడే ఛలో విజయవాడకు సంబంధించిన మూడవ దశ కార్యక్రమం సమర శంఖం పూరించి..
విజయఢంకా మోగించి.. మార్కాపురం జిల్లాలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎస్ టి యు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ దేశా నాయక్ పిలుపు ఇవ్వడం అయినది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శామ్యూల్ డి తిరుపతి నాయక్ గౌరవ అధ్యక్షులు జే వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి ఆర్ మాలకొండ నాయక్ జిల్లా కౌన్సిలర్ మురళి గోపాల్ ఆత్మానంద ప్రభాకర్ శ్రీనివాస్ రెడ్డి గోపాల్ రెడ్డి ఎస్ కే కలాం ఆంజనేయులు జీవి నరసయ్య శ్రీనివాసులు సతీష్ నాగరాజు సక్రు నాయక్ మస్తాన్ సాయిబాబా రవీంద్ర దేవప్రసాద్ గుల్షన్ భాష తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
You may also like
మైనర్లు వాహనాలు నడుపుట చట్టరీత్యా నేరం. యఎస్ ఐ.పి.చౌడయ్య.
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
రజక విద్యా సేవా సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ డైరీ ఆవిష్కణ
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు లేకుంటే తగు చర్యలు.



