మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు..
బెయిల్ రద్దు చేసి జూన్ 30 తర్వాత మళ్లీ బెయిల్ ఇవ్వాలని వెంటనే ఉత్తర్వులు ఇవ్వడంపై సీజేఐ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇవేం ఉత్తర్వులంటూ అసహనం వ్యక్తం చేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో నిందితుడు (ఏ1) ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల షరతును ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హంతకులు బయట ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చే వారం పిటిషన్‌పై విచారణ జరపనుంది..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



