ఏప్రిల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయండి
కార్మిక వర్గానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)పిలుపు
బెల్లంపల్లి మార్చి 12(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ సీపీఐ ఎరుపాటు చేసిన సమావేశంలో ఈ నెల 17న ఆందోళనలు మార్చి 18 నుండి సేవ్ సింగరేణి జాతా–ఏప్రిల్ ల్లో సమ్మెను జయప్రదం చేయాలని,కార్మికవర్గానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ – ఏఐటీయూసీ పిలుపునిచ్చింది.
ఈ సందర్బంగా ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట స్వామి మాట్లాడుతూ…కార్మికవర్గం ఐక్యపోరాటాలతో తిరిగి సాధించుకున్న కార్పొరేట్ మెడికల్ బోర్డులో గత సంవత్సరం ఏసీబీ కేసు నమోదు అయిందనే సాకుతో మెడికల్ బోర్డు నిర్వహణను ఆపివేశారన్నారు.కార్పొరేట్ మెడికల్ బోర్డును అవినీతిరహితంగా నడపడంలో విఫలమైన యాజమాన్యం ఏసీబీ కేసులో దొరికిన బ్రోకర్లపై కేసులు పెట్టి అదుపు చెయ్యకుండా కుంటి సాకులతో బోర్డు ఆపివేసి సుమారు 10 నెలలుగా బోర్డుకు అప్లై చేసిన వారిని పిలవకుండా వారు అనారోగ్యంతో డ్యూటీలు చేయలేని పరిస్థితిలో ఉంటే వారిపై నాగాల పేరుతో చర్య తీసుకోవడం దుర్మార్గమన్నారు.మెడికల్ బోర్డు విషయాన్ని ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి,గుర్తింపు సంఘం ఏఐటియుసి తీసుకుపోయిన సందర్భంలో బోర్డు తప్పక పాతపద్ధతిలో కొనసాగిస్తామని హామీ ఇచ్చారన్నారు.బహిరంగసభల్లో ప్రస్తావించారు కానీ ఆచరణలో ఇప్పటికీ అమలు కావడంలేదన్నారు.మెడికల్ ఫిట్ అయ్యి ట్రైనింగ్ కు సిద్ధంగా ఉన్న సుమారు 300 మంది డిపెండెంట్లకు పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్ అయిన కార్మిక కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.గత సంవత్సరం ఎఐటియుసికి గుర్తింపు సంఘం పత్రం రాగానే,మొదటి స్ట్రక్చర్ సమావేశంలో మన యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావుతో కూడిన సెంట్రల్ నాయకత్వం స్ట్రక్చర్ కమిటీలో కార్మికుల సొంత ఇంటి పథకం, పెర్న్స్ పై ఇన్కంటాక్స్ కంపెనీనే చెల్లించాలనే డిమాండ్ చేయగా యాజమాన్యం సానుకూలంగా స్పంధించి కమిటీ వేసి పరిష్కరిస్తామని అంగీకరించారు. కానీ ఓ ట్రేడ్ యూనియన్ పట్ల పక్షపాతం వహిస్తూ కాలయాపన చేశారే తప్ప ఇప్పటివరకు సమస్య పరిష్కారంకాలేదు.మారుపేర్లు గల కార్మికుల సమస్య,డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కరిస్తామని,హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని యాజమాన్యం కార్మికులను మభ్యపెడుతూ ఇప్పటికీ కాలయాపన చేస్తున్నారు.సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం వలన కొత్త మైన్స్ రాకపోవడం, ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సిన బకాయిలు రావడంలేదని వారన్నారు.బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ..ప్రభుత్వం నుండి సింగరేణికి రావలసిన,రూ.50 వేల కోట్ల బకాయిలు రాకపోవటం వలన, కార్మికులకు కనీసం నూతన సంవత్సర క్యాలెండర్ ఇచ్చే గతి కూడా లేదన్నారు.
నూతన ట్రాన్స్ఫర్ పాలసీ,జనరల్ అసిస్టెంట్ (సర్ఫేస్) కార్మికుల నియామకం పాలసీ వలన కార్మికులను అవస్థలకు గురిచేస్తూ,విజిలెన్స్ ఎంక్వయిరీ పేరు మీద కార్మికులను డిస్మిస్ చేస్తున్నారు.కారుణ్య నియామకాల్లో కారుణ్యం లేని నిబంధనలతో వేధిస్తున్నారు.మైనింగ్, ట్రేడ్స్మెన్లకు అన్ఫిట్ అయినవారికి సూటబుల్ జాబు ఇస్తామని అంగీకరించి అది కూడా అమలు పరచడంలేదు.
సింగరేణి ప్రారంభించాల్సిన గనులలో ఇల్లందులోని కోయగూడెం – 3, జెకె-5 ఎక్సటెన్షన్ (రొంపేడు),మణుగూరులోని మణుగూరు ఓపెన్కాస్ట్, PKOC-2 డిప్ర్సెడ్ బ్లాక్ వేలంలో రావాల్సినది) భూపాలపల్లిలోని పి.వి. నర్సింహారావు ఓపెనకాస్ట్, కే టీ కే ఓసీ -2 పంచ్ ఎంట్రీ, తాడిచర్ల-2, ఆర్ కే ఓసీ, గోలేటి ఓసీ, మాధారం ఓసీ, మొదలగు బొగ్గుగనులను ప్రారంభించకుండా సంస్థలో కార్మికుల సంఖ్య అవసరానికిమించి ఉన్నదని అధికారులు చేతులెత్తేయడం సమంజసం కాదని వారన్నారు.రెండు బ్రాంచ్ ల ఇంచార్జ్ చిప్ప నరసయ్య మాట్లాడుతూ..
క్లరికల్,పారా మెడికల్, ఎస్&పీసీ,పీ ఓ ఏ , ఎలక్ట్రిషియన్లు,ఫిట్టర్లు ఇతర డిపార్ట్మెంట్లలోని ఖాళీలను ఇంటర్నల్ ఉద్యోగులతో పూరించాలనీ,అన్ని క్యాడర్ స్కీంలు సవరించాలని,ఓవర్మెన్ ఖాళీలలో సీనియర్ మైనింగ్ సర్దార్లకు ప్రమోషన్లు ఇవ్వాలనీ,సాధారణ మరణం పొందినా కార్మికులకు రూ.25 లక్షల ఎక్స్రేషియా చెల్లించాలనీ,కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, హై పవర్ కమిటీ జీతాలు చెల్లించాలనీ,ఓ.సి.లలో నూతన యంత్రాలు మరియు అందర్ గ్రౌండ్ మైన్స్లో ఎస్ డి ఎల్.ఎల్ హెచ్ డీ రక్షణ పరికరాలు ఏర్పాటు చేయాలనీ, అన్ని ఏరియాల్లో సీ బీ ఎస్ ఈ స్కూల్స్ ప్రారంభించాలి.సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం వలన జరిగిన కుంభకోణాలు,అవినీతి,టెండర్లలో జరిగిన అక్రమాలు,ఉత్పత్తి అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై తగిన చర్య తీసుకోవాలనీ,సింగరేణిలో ప్లానింగ్ లోపాల వలన జరిగిన కోట్లాది రూపాయల నష్టంపై అలాగే ‘నైనీ’ బ్లాక్పైన విచారణ జరిపించాలి. సింగరేణిలో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై విచారణ జరపని యాజమాన్యం కార్మికులను మాత్రం విజిలెన్స్ పేరుతో చిన్నచిన్న తప్పులకు డిస్మిస్ చేయటం,కారుణ్య ఉద్యోగాలు ఎగ్గొట్టడం చేస్తున్నారు.కావున పై సమస్యలపై చర్చించి పరిష్కారం కొరకు 2026 మార్చి 17న అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో ధర్నాలు, నల్ల బ్యాడ్జీల ప్రదర్శనలు, మార్చి 18న శ్రీరాంపూర్లో సేవ్ సింగరేణి జాతా ప్రారంభించి అన్ని ఏరియాల కార్మికులను చైతన్య పరుస్తూ, మార్చి 30న జాతా ముగింపులో భాగంగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను,ఏప్రిల్ నెలలో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కార్మికవర్గానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
ఆడెపు రాజమౌళి బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి,దాసరి తిరుపతి గౌడ్ బెల్లంపల్లి బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రెటరీ,
మీనుగు లక్ష్మీనారాయణ
కాసిపేట వన్ ఫిట్ కార్యదర్శి ,
గొల్ల శ్రీనివాస్ కాస్పేట టు ఫిట్ కార్యదర్శి ,డి ఆర్.శ్రీధర్ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ పిట్ కార్యదర్శి ,
మంతెన రమేష్ బెల్లంపల్లి బ్రాంచ్ ఆఫీస్ బేరర్,బొంకురి రామచందర్ బెల్లంపల్లి బ్రాంచ్ కౌన్సిల్ సభ్యులు,
సాగర్,శేషికుమార్,రామకృష్ణ,వివేక్ తదితరులు పాల్గొన్నారు…



