బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కీ ప్రభుత్వం కట్టుబడి ఉండి

ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి..
బెల్లంపల్లి మార్చి 13(అఖండ భూమి న్యూస్)బెల్లంపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు.
ఈ సందర్బంలో బెల్లంపల్లి పట్టణంలోని 30వ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రపరిచే పనులను ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అయన తెలిపారు.అలాగే 99 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణంలోని 34 వార్డుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు.బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కీ ప్రభుత్వం కట్టుబడి ఉందని,ప్రజల సమస్యలను గుర్తించి దాఫాలవారీగా పరిష్కరిస్తామని అయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, సంబంధిత వార్డ్ కౌన్సిలర్లు,అలాగే మున్సిపల్ అధికారులు బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


