పడవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తూ ఏర్పాటు
బెల్లంపల్లి మార్చి 13(అఖండ భూమి న్యూస్):నేటినుండి పదవ తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు 1టౌన్ సీఐ కె.శ్రీనివాస రావు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… మొదటగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ పోలీసు వారి తరపున శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే విద్యార్థులందరూ కూడా ఈ 365 రోజులు ఎంతో కష్టపడి చదువుకున్న చదువును రేపటి నుంచి జరిగే పరీక్షలలో ఆ మూడు గంటల్లోనే ప్రజెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని మేము కోరుకుంటున్నామన్నారు.పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని,బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ కే శ్రీనివాసరావు తెలిపారు.పట్టణ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బీ ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు తెలిపారు.బెల్లంపల్లి పరిధిలోని మొత్తం 3 పరీక్ష కేంద్రాల్లో రేపటి అనగా 14 మార్చి నుండి ఏప్రిల్ 16 వరకు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీఐ తెలిపారు.
1)పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.
2)సభలు,సమావేశాలు,ర్యాలీలు, ధర్నాలు నిషేధం.
3)పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు తేది రేపటి నుండి ఏప్రిల్ 16 నుండి 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని సీఐ శ్రీనివాస రావు ఆదేశించారు.
ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని సీఐ శ్రీనివాస రావు హెచ్చరించారు…



