రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు కానుకల

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
బెల్లంపల్లి మార్చి 14(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శనివారం బాబు క్యాంప్ జామ మసీద్‌లో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఇఫ్తార్ విందులో ఉపవాస విరమణ చేశారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రంజాన్ పర్వదినం ఐక్యత,సహనం, సేవాభావాన్ని గుర్తు చేసే పవిత్రమైన కాలమని పేర్కొన్నారు.ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయన్నారు.సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసి మెలసి జీవించాలని ఆకాంక్షించారు.
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ అని తెలిపారు.ఈ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థించారు.ముస్లిం సోదరులు ఆర్థికంగా,రాజకీయంగా,సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. నియోజకవర్గంలోని నిరుపేద ముస్లింలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి కృషి చేస్తానని అన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత సామరస్యానికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారన్నారు.ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ తోడుగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.రంజాన్ పండుగ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ఇఫ్తార్ నిర్వాహకులను అభినందించారు.ప్రజా ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమాన గౌరవం ఇస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరేటి రాజేశ్వరి,బెల్లంపల్లి మండల తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్,బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు,కౌన్సిలర్లు,మైనార్టీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
You may also like
పడవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తూ ఏర్పాటు
బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కీ ప్రభుత్వం కట్టుబడి ఉండి
ఏప్రిల్‌లో జరిగే సమ్మెను జయప్రదం చేయండి
హోలీ వేడుకల్లో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…
హోలీ వేడుకల్లో పాల్గొన్న డైనమిక్ లీడర్ తీగల తిరుమల గౌడ్…


