బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబరాన్ని అంటిన ఉగాది సంబరాలు
-తెలుగు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం
-ఆకట్టుకున్న కవితలు,పాటలు, పూర్ణాలు,షడ్రుచులు
బెల్లంపల్లిమార్చి 18(అఖండ భూమి న్యూస్):బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ముందస్తుగా నిర్వహించిన శ్రీ పరాభవ నామ నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభావంగా జరిగాయి.ప్రధాన ఆచార్యులు డాక్టర్ కాంపల్లి శంకర్ అనుమతి మేరకు,ఇన్చార్జి ప్రిన్సిపాల్ మేడ తిరుపతి అధ్యక్షతన తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ కంబాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఆకట్టుకున్న వేదిక,వంటకాలు,
ఉగాది ఉత్సవ వేడుక కోసం వేదికను విద్యార్థులు,అధ్యాపకుల సంయుక్త భాగస్వామ్యంతో అందంగా తయారు చేశారు.మామిడాకుతొరణాలు,వేప కొమ్మలు,వివిధ రకాల పూలతో అలంకరించారు,కొత్త కుండలో ఉగాది పచ్చడిని సిద్ధం చేశారు.పూర్ణాలు, పులిహోర,రవ్వ,సిర వంటి వంటకాలు ఘుమఘుమలాడాయి.ఈ సందర్భంగా ఆయా వంటకాలను బోధన,బోధనేతర సిబ్బంది,విద్యార్థినీ,విద్యార్థులు ఆస్వాదించారు.అలరించిన పాటలు, కవితలు,ఉగాది ఉత్సవంలో వక్తల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.ఈ సందర్బంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ మేడ తిరుపతి మాట్లాడుతూ… పండుగ గూర్చి కొనియాడారు.అర్థశాస్త్ర సహాయ ఆచార్యులు ఎంఏ రేష్మ మాట్లాడుతూ.. పండుగలో అందరూ భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఉగాది ఉత్సవ ప్రాశస్త్యాన్ని అధ్యాపకులు రఫిక్ తెలియజేశారు. అధ్యాపకులు గజెల్లి మోహన్, సూపరింటెండెంట్ పుప్పాల శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, లింగయ్య తదితరులు అధ్యాపకులకు, విద్యార్థిని,విద్యార్థులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ నిర్వహణ కర్త డాక్టర్ కంబాల మురళీకృష్ణ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.విద్యార్థిని గాయత్రి కవిత్వం చదివి వినిపించగా… అధ్యాపకులు అల్లం తిరుపతి పాట ఆలపించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ మేడ తిరుపతి,కార్యక్రమ నిర్వహణ కర్త,తెలుగు విభాగ అధ్యాపకులు డాక్టర్ కంబాల మురళీకృష్ణ,సూపరింటెండెంట్ పుప్పాల శ్రీనివాస్,సహాయ ఆచార్యులు, అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది, విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



