బెల్లంపల్లి టీ ఎన్ టీ యూ సీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం

బెల్లంపల్లి మార్చి 18(అఖండ భూమి న్యూస్)మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ టీఎన్టీయూసీ కార్యాలయంలో బుధవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా నాయకులు మణి రాంసింగ్ మాట్లాడుతూ…సింగరేణి బొగ్గు గనుల కార్మికోద్యమానికి నేటికీ 126 సంవత్సరాల చరిత్ర ఉందని,ఎన్నో పోరాటాలు,ఉద్యమాలు,త్యాగాల ఫలితమే నేడు సింగరేణి కార్మికులు అనుభవిస్తున్న హక్కులు సౌకర్యాలు ఉపాధి కల్పనకు కల్పతరువు తెలంగాణ కొంగుబంగారం సింగరేణి ఇప్పుడు సింగరేణిలో సంస్కరణల పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టబడ్డాయి ఉపాధినిచ్చే భూగర్భ గనుల స్థానంలో ఓపెన్ కాస్టు లు వచ్చాయన్నారు.
పరుగు పంధ్యంలో ఉద్యోగాలు సాధించుకున్న గని కార్మిక వర్గం చెమ్మసు చేత బట్టి బరిగి నీ నిలిచిన గని కార్మిక వర్గం నేడు సింగరేణిలో లేదు,హక్కుల కోసం అడిగే గొంతులు అనుచివేయబడుతున్నాయన్నారు. సస్పెండ్,చార్ సీట్లు నిత్య కృత్యమైనాయి హక్కుల కోసం కార్మిక వర్గం పక్షాన ముందు ముందు ఉండవలసిన జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యం సంకలో చేరాయన్నారు.పోరాడే సంఘాలకు ఇప్పుడున్న కమర్షియల్ కార్మిక వర్గం ఆదరించటం లేదు కార్మిక వర్గ ఉద్యమం అంటే కేవలం ఆర్థికపరమైన డిమాండేతప్ప దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు జరుపుతున్న పారిశ్రామిక విధానపరమైన కార్మిక వ్యతిరేక విధానాల విధానాల పట్ల ముఖ్యంగా జాతీయ కార్మిక సంఘాలకు చిత్తశుద్ధి కరువైందన్నారు.దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దేశపాదిస్తానిక రంగాన్ని గంపగుత్తగా అమ్మేస్తుండగా నామమాత్రాల బంధు పిలుపునిచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి జాతీయ సంఘాలు విఫలo అయ్యాయన్నారు.
అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో వీరే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సింగరేణిలో సైతం వీరు విధానపరమైన ఉద్యమాలు నిర్మించటంలో విఫలo అయ్యారన్నారు.ప్రైవేటీకరణ నుండి ఒక్కజాతీయ పరిశ్రమను కూడా కాపాడలేక పోయారన్నారు.సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఎంఎండిఆర్ ను అడ్డుకోలేక పోయారన్నారు.పాలకవర్గ పార్టీలు ఆగిపోతే నెట్టడం సాగిపోతే తిట్టడం వీరికి అలవాటుగా మారిoదన్నారు.వీరి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్న సింగరేణిలో అడుగున ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ ఔట్సోర్సింగ్ జరుగుతున్న కూడా అడ్డుకోలేకపోయాయి,అది అలాఉండగా గతంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏఐటీయూసీ ఐఎన్టియుసి ఇప్పుడు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాకుల వేలం పాటలు రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనాలని చెప్పడం వలన కార్మిక వర్గానికి వీరి యొక్క నిజ స్వరూపం బట్టబయలైందని,కార్మిక వర్గం ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.సింగరేణిలో ఉన్న బొగ్గు బ్లాకులను వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణి కేటాయించాలని టీ. మణిరాం సింగ్ సింగరేణి కాలరీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టిఎన్టియుసి డిమాండ్ చేశారు.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గనుక బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొనకుండా మన బొగ్గు బ్లాగులను మనమే రక్షించుకొనుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలని అయన కోరారు.అదేవిధంగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు ఆరు గారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలను కాంట్రాక్ట్ కార్మికులను కూడా పర్మినెంట్ చేయాలని లేకపోతే అన్ని జి.ఎం ఆఫీస్ ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని టిఎన్టియుసి నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గద్దల నారాయణ ఎస్సిఈఎల్యూ ఉపాధ్యక్షులు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఓ.జీవరత్నం,బొల్లు మల్లయ్య,
మందమర్రి ఏరియా కార్యదర్శి ఎం.వెంకటస్వామి,గుండేటి శంకర్,బెల్లంపల్లి ఫిట్ చంద్రమౌళి, మాదాసి గోపాల్,బీ.సత్యనారాయణ, ఎస్ పాండే,ఎండి.అస్గర్ బాషా,గైని తిరుపతి,ఆర్.గంగాధర్ గౌడ్,పుల్లూరి పోశం,ఎం.రాజయ్య,మేకల నర్సింగ్,పీ. రాములు తదితరులు పాల్గొన్నారు…
You may also like
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబరాన్ని అంటిన ఉగాది సంబరాలు
రాజీవ్ యువ వికాసం అమలుకై బెల్లంపల్లి ఎంఆర్ఓ వినతి
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు కానుకలు
పడవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తూ ఏర్పాటు
బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కీ ప్రభుత్వం కట్టుబడి ఉండి


