కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి సంస్థగతంగా పటిష్టం చేయాలి…

కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి సంస్థగతంగా పటిష్టం చేయాలి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 26 (అఖండ భూమి న్యూస్);

కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి సంస్థగతంగా మరింత పటిష్టం చేయాలని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం

కామారెడ్డి పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్‌లో ఘనంగా పీఏసీ సమావేశం – జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గానికి బాధ్యతల అప్పగించి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు వచ్చే ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని చేదు ఎక్కించుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమంపై ప్రజలలోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుండి గ్రామ, పట్టణ, నగరాలలో పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు సైనికుల పనిచేయాలని అన్నారు. ఎలాంటి గ్రూపు తగాదాలు లేకుండా సమన్వయంతో పాటు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, యూసుఫ్ అలీతో పాటు డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి, నూతనంగా నియమితులైన జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులకు ప్రమాణ స్వీకారం చేయించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. అలాగే వారికి నియామక పత్రాలను అందజేసి పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు సూచించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,

కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా మరింత బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వ్యక్తిగత భేదాభిప్రాయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు, అవకాశాలు లభించాయని, అవకాశం రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో వారికి కూడా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ ఆస్తి అని, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు

గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఐరేనీ సందీప్, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ .గూడెం శ్రీనివాస్ రెడ్డి, నౌసిలాల్ , పల్లె రమేష్ గౌడ్, రాజా గౌడ్, అంకం కృష్ణారావు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, పాత రాజు, సుతారి రమేష్, భీమ్ రెడ్డి, యాదవ్ రెడ్డి,

అనంత రెడ్డి, తిరుమల్ గౌడ్, సి డి సి చైర్మన్ ఇర్షాద్, పండ్లరాజు, గంప ప్రసాద్, గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!