*మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి కన్నుమూత…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్);
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ నేత గాదె వెంకట్రెడ్డి(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈయన నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో పని చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


