‘రహదారి వీరుల’ పథకంపై కలెక్టర్ సమీక్ష:…
– ప్రమాద బాధితులను కాపాడితే రూ. 25,000 బహుమతి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30. (అఖండ భూమి న్యూస్) ;
రహదారి ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడేందుకు ఉద్దేశించిన ‘రహదారి వీరుల’ (రహవిర్) పథకాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఈ పథకం అమలు తీరు పై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ప్రజలు తక్షణమే స్పందించి బాధితులకు సాయం చేయాలని, ప్రతి ఒక్కరూ ‘రహదారి వీరులు’గా మారాలని పిలుపునిచ్చారు.
ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో కాపాడిన వారికి ప్రభుత్వం తరఫున రూ. 25,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుఈ పథకాన్ని పారదర్శకంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ‘డిస్ట్రిక్ట్ అప్రిసియేషన్ కమిటీ’ (డిస్టిక్ అప్ప్రెసిషన్ కమిటి) ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, సభ్యులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ), జిల్లా రవాణా అధికారి (డిడిఓ), జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆయన వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు, బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూసేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


