ఉద్యోగుల మే నెల వేతనం నుండి ఈ హెచ్ ఎస్ కోసం 1.5% వేతనాన్నిబలవంతంగా మినహాయింపు…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విధివిధానాలు రూపొందించకుండా మినహాయించిన వేతనాన్ని ఉద్యోగుల ఆకౌంటుకు జమ చేయాలి..
టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 31 (అఖండ భూమి న్యూస్);
ప్రభుత్వం ఎంప్లాయిస్ ఆరోగ్య పథకం కోసం ఉద్యోగుల మే నెల వేతనం నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం మినహాయిస్తూ పేస్లిప్స్ జనరేట్ చేశారు. ఆరోగ్య పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించకుండా, కనీసం డ్రాయింగ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం దొడ్డిదారిన ఉద్యోగుల వేతనం నుండి 1.5 శాతం మినహాయింపు చేయడాన్ని టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం తీవ్రంగా ఆదివారం ఖండించారు. .రాష్ట్రంలోని ఏ హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నారనే స్పష్టత లేదని అన్నారు. భార్యాభర్తలు ఉద్యోగులైన సందర్భాలలో, తల్లిదండ్రులు ఉద్యోగులైన సందర్భాల్లో, వేతన మినహాయింపులు ఏ విధంగా చేస్తారనే నిబంధనలు రూపొందించకుండానే ప్రతి ఉద్యోగం నుండి మినహాయింపు చేశారు. ఇది అక్రమమైన చర్యగా భావిస్తున్నాము.
హెల్త్ కార్డులు జారీ చేయకుండా, టీచర్ల సమ్మతి తీసుకోకుండా మినహాయించిన 1.5 శాతం వేతనాన్నీ ఉద్యోగుల ఎకౌంటుకు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు..లేనట్లయితే ప్రభుత్వ అసంబద్ధ విధానాల పైన టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని. హెచ్చరించారు.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


