అట్టహాసంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
– లబ్ధిదారులతో గృహప్రవేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 01. (అఖండ భూమి న్యూస్) ;
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణాలు పూర్తిచేసుకున్న ఇళ్ల గృహప్రవేశాల మహోత్సవం సోమవారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని అడ్లూరి ఎస్సీ కాలనీ, వార్డు నంబర్-2లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణిలతో కలిసి లబ్ధిదారులు పెరుమాళ్ల లింగం, ఎల్లవ్వల నూతన గృహంలో గృహప్రవేశం నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో, కామారెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకున్న ఇళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సహకారంతో సొంత ఇంటి కలను సాకారం చేసుకున్న లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. గృహ నిర్మాణాలను విజయవంతంగా పూర్తిచేసుకుని గృహప్రవేశం నిర్వహించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులు తమ సొంతింటి కలను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


