అన్నప్రసాదాలపై టీటీడీ తాజా నిర్ణయాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్);
శ్రీవారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులకు వడ్డించే అన్నప్రసాదాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తాజా నిర్ణయాలను తీసుకుంది. భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాన్ని అందించడమే తమ ప్రాథమిక లక్ష్యమని పునరుద్ఘాటించింది.నాణ్యమైన ఆహారాన్ని అందించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఉద్దేశంతో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఏపీ, తెలంగాణలకు చెందిన బియ్యం, పప్పు మిల్లుల యజమానులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాన్ఫెలెక్స్‌లో భక్తుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంతో పోలిస్తే వడ్డిస్తున్న అన్నప్రసాదం నాణ్యత, రుచి ఎంతో మెరుగుపడిందని 98 శాతానికి పైగా భక్తులు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. సోమవారం రాత్రి అన్నప్రసాద కేంద్రంలో బియ్యం మిల్లుల యజమానులు స్వయంగా భక్తులతో మాట్లాడగా, మెజారిటీ భక్తులు ఆహార నాణ్యతపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని అదనపు ఈవో వివరించారు.
అన్నప్రసాదంతో పాటు అదనంగా పప్పు వడ్డించాలని అన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


