దేశ ప్రధానిగా మోడీ రికార్డ్ సాధించినందుకు బిజెపి నాయకులు పూజలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్);
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా భారత ప్రధానిగా అత్యధిక కాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సంకష్ట గణపతి ఆలయంలో బీజేపీ నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ. దేశ ప్రధానిగా 2014 నుండి మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా చేసిన వ్యక్తిగా జవహర్ లాల్ నెహ్రూ రికార్డు ను తిరగరాసిన సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పట్టణంలోని సంకష్ట గణపతి ఆలయంలో అర్చన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజా సేవలో, దేశ సేవలు, ధర్మం కోసం పని చేస్తున్న నరేంద్ర మోదీ ఈ దేశానికి అవసరం అని అన్నారు. మరో సారి కూడా ఎన్డీఏ సారథ్యంలో నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేద్దాం…
ప్రాంగణ నియామకాల్లో 23 మంది సోషల్ వర్క్ విద్యార్థుల ఎంపిక …
ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…
ఆర్ఎంపి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం…
*దోమకొండలో పెన్షన్లు పంపిణీ పరిశీలించిన మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…


