ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉత్తమ బోధనతో విద్యార్థులకు సత్ఫలితాలు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉత్తమ బోధనతో విద్యార్థులకు సత్ఫలితాలు...

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్న జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 20 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోడల్ ఆఫీసర్ షేక్ సలాం శనివారం పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మాట్లాడుతూ. అనుభవం గల అధ్యాపకులు ఉన్నారని. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉత్తమమైన బోధన ఉంటుందని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. శనివారం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు అదృష్టవంతులని వారు అన్ని రంగాలలో ఎదిగే విధంగా అధ్యాపకులు కృషి చేస్తారని తెలిపారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ సంవత్సరం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు వచ్చాయని అలాగే అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో

అధ్యాపకులు చక్కని బోధనతో పాటు సమిష్టిగా కృషి చేస్తూ కళాశాల అభివృద్ధి కోసం అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయడం అభినందనీయమని షేక్ సలాం అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ

అడ్మిషన్ల సంఖ్య మరింత పెంచే విధంగా విద్యార్థులు అధ్యాపకులకు సహకరించాలని సూచించారు. నిరుపేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వo ఉపకార వేతనాలు ఇస్తోందని ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక ప్రణాళిక బద్దంగా విద్యా బోధన జరుగుతుందని విద్యార్థులు కూడా రెగ్యులర్గా కళాశాలకు వచ్చి చక్కని ఉత్తమ విద్యార్థులుగా రానించి తల్లి తండ్రుల కలలు నిజం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అద్యాపకులు సంతోష్, వీరేశం, మల్లేశం, శ్రీకాంత్, సతీష్ చంద్ర, శ్రీనివాస్, సరస్వతి, మనీష, శ్రీకాంత్, హారిక కళాశాల సిబ్బంది నర్సయ్య, సోటేరియా, లక్ష్మి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!