మాచారెడ్డి లో ఘనంగా గంగమ్మ తల్లికి తిరుగు బోనాలు…
ఉత్సవాలలో పాల్గొన్న గంగాపుత్రులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 20 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో గంగమ్మ ప్రథమ వార్షిక ఉత్సవాలలో భాగంగా శనివారం గంగమ్మకు బోనాలను సమర్పించి తిరుగు ప్రయాణం చేశారు. మాచారెడ్డి చెరువు సమీపంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం గంగమ్మకు బోనాల సమర్పించి, కళ్యాణం నిర్వహించారు. శనివారం తిరుగుబోనాలను ఆలయం నుండి వారి ఇంటికి చేర్చుకున్నారు. డప్పు వాయిద్యాలతో శివసత్తుల నాట్య నృత్యంతో యువకుల ఉత్సాహంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం సమీపంలో అన్నదానం నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని కోరుకున్న కోరికలు తీర్చాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సదర సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


