అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి…
*ఆల్ ఇండియా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిమాండ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 21 (అఖండ భూమి న్యూస్);
అఖిల భారతీయ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశానికి కామారెడ్డి జిల్లా అడక్ కమిటీ ప్రతినిధులు గర్దాస్ చంద్ర శేఖర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అఖిల భారతీయ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ డీ.ఎల్.ఎన్.చారి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యతతోనే వారి సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.జర్నలిస్ట్ ల సమస్య ల పై యూనియన్ ఎల్లవేళలా ముందుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, నరసింహులు, రమేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


